top of page

3

నడిపించు నా నావా

Nadipinchu Naa Naavaa

నడిపించు నా నావా (Nadipinchu Naa Naavaa)
00:00 / 100:45:10

నడిపించు నా నావా
నడిసంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింప
నడిపించు||

1. నా జీవిత తీరమున
నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము
నా సేవ జేకొనుము
నడిపించు||

2. రాత్రంతయు శ్రమపడినా
రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను
రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో
రాజిల్లు నా పడవ
నడిపించు||

3. ఆత్మార్పణ చేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే ఆవేదనెదురాయె
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నా వలలు
నడిపించు||

4. ప్రభు మార్గము విడచితిని
ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమునుబొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట
నడిపించు||

5. లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటకు నేర్పించి
లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పణగా లోకేశ జేయుమయ
నడిపించు||

6. ప్రభు యేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
ప్రాణార్పణము జేతున్
నడిపించు||

Chord :

E Major

CONTACT

TODAY'S CHAPTERS

సమూయేలు మొదటి గ్రంధము (1 SAMUEL) - 9Old Testament
00:00 / 125:11:24
హెబ్రీయులకు (HEBREWS) - 6New Testament
00:00 / 64:27:36

Sunday Worship - 2nd Feb. 2025

Sunday Worship - 2nd Feb. 2025
00:00 / 1:24:38

**Note: Please do not submit your prayer requests here. This form is for submitting your valuable suggestions, improvements and complaints about this website to JCIM Admin.​

© Copyright Protected by JCIM India
bottom of page