top of page

1
సర్వోన్నత స్థలములలో
Sarvonnatha Sthalamulalo
సర్వోన్నత స్థలములలో (Sarvonnatha Sthalamulalo)
00:00 / 108:01:27
సర్వోన్నత స్థలములలో
దేవునికి స్తుతి మహిమ
తనకిష్టులైన ప్రజలకు
భువిలో సమాధాన వార్త
ధూతాళి పాడగా
ఈ పుడమి పులకించగా
మహనీయుని జన్మమే పండుగా
1. శాంతి లేక విశ్రాంతి కోరి
తిరుగాడే ప్రతివారికి
భారమైన పాపాల చింత
మరి వేదన కలిగించెను 2||
దావీదు చిగురుగ యేసు
పాపులను రక్షించను 2||
పశిబాలుడై పుట్టెను పండుగా
సర్వోన్నత||
2. రాజుగా మహ రాజుగా
ఆ ప్రభుని పూజింపను
తారతో ఆ జ్ఞానులు
రారాజుని దర్శించిరి 2||
బంగారు బోళము
సాంబ్రాణినర్పించిరి 2||
పూజించిరి బాలుని రాజుగా
సర్వోన్నత||
Chord :
C Major
bottom of page
