top of page

2

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను

Yehova Mahima Nee Meeda Udayinchenu

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను (Yehova Mahima Nee Meeda Udayinchenu)
00:00 / 50:03:29

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును 2||
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది 2||
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము 2||

1. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము 2||
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు 2||
లెమ్ము||

2. ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును 2||
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని
ప్రభువు సెలవిచ్చెను 2||
లెమ్ము||

TODAY'S CHAPTERS

యిర్మీయా (JEREMIAH) - 23Old Testament
00:00 / 175:16:41
1 పేతురు (1PETER) - 3New Testament
00:00 / 78:57:58

Sunday Worship - 12th Jul. 2026

Sunday Worship - 12th Jul. 2026
00:00 / 40:21
© Copyright Protected by JCIM India
bottom of page