
5
నీ స్వరము వినిపించు ప్రభువా
Nee Swaramu Vinipinchu Prabhuvaa
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ 2||
1. ఉదయమునే లేచి
నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు
నను సిద్ధపరచి
రక్షించు ఆపదలనుండి 2||
నీ స్వరము||
2. నీ వాక్యము చదివి
నీ స్వరము వినుచు
నేను సరిచేసుకొందు
నీ మార్గములో
నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ 2||
నీ స్వరము||
3. భయ భీతులలో
తుఫానులలో
నీ స్వరము వినిపించును
అభయమునిమ్ము
ఓ గొప్ప దేవా
ధైర్యపరచుము నన్ను 2||
నీ స్వరము||
4. నాతో మాట్లాడు
స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో
సరిజేసుకొందు
నీ దివ్య వాక్యము ద్వారా 2||
నీ స్వరము||
5. నీ వాక్యము
అగ్ని సుత్తెవంటిది
అది రెండంచుల ఖడ్గం
నీ వాక్యమేగా అద్భుత అద్దం
నిజ స్వరూపమును చూపించున్ 2||
నీ స్వరము||
6. నేర్చుకొన్నాను
నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా
నీ విశ్వాస్యతలో
నీ యందు నిలుచునట్లు 2||
నీ స్వరము||
7. నా హృదయములోని
చెడు తలంపులను
ఛేదించు నీ వాక్యము
నీ రూపములోకి
మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా 2||
నీ స్వరము||
